మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన శ్రీను వైట్ల

మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన శ్రీను వైట్ల
మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన శ్రీను వైట్ల

దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ ను కెరటంతో పోల్చవచ్చేమో. వరసగా కామెడీ ఎంటర్టైనెర్స్ తో అగ్ర దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఈ దర్శకుడు తర్వాత తన ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. వరస ఫెయిల్యూర్స్ తో తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడు. అయితే కొంత బ్రేక్ తీసుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు ఢీ అండ్ ఢీ చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఆగస్ట్ నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఈ చిత్రం ఢీ కు సీక్వెల్ కాదని తెలియజేసాడు శ్రీను వైట్ల. ఢీ ఫ్లేవర్ మాత్రమే ఉంటుందని తెలిపాడు. ఇక ఢీ అండ్ ఢీ తర్వాత మరో రెండు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపాడు. డబుల్స్ పేరుతో ఒక మల్టీస్టారర్ కామెడీ ఫిల్మ్ ను తీయాలని భావిస్తున్నాడట. ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోస్ ఈ సినిమాలో నటిస్తారని సమాచారం.

ఇక దూకుడు సీక్వెల్ గురించి అడగ్గా మహేష్ బాబుతో ఇంకా బెటర్ సినిమా చేయాలని ఉందని శ్రీను వైట్ల తెలిపాడు.