పవన్ ఫ్యాన్స్ పై కేసు పెట్టిన శ్రీరెడ్డి


Actress srireddy files case on pawan kalyan fans

వివాదాస్పద నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై కేసు పెట్టింది. ఒక్క పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పలువురు నెటిజన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా శ్రీరెడ్డి పోలీసులను ఆశ్రయించడానికి కారణం ఏంటో తెలుసా…….. తనని సోషల్ మీడియాలో వెంటపడి మరీ అశ్లీలంగా కామెంట్స్ చేయడమే కాకుండా బూతు వీడియోలు పోస్ట్ చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అలాగే కొంతమంది నెటిజన్ల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీరెడ్డి.

అసలు కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని లేపిన శ్రీరెడ్డి తెలుగునాట సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ వివాదం మొదలు అయినప్పుడే తనని ఫేస్ బుక్ లో ఎవరినైనా ఘాటుగా విమర్శిస్తే , బూతులు తిడితే ఊరుకునేది లేదని పేర్కొంది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి వివరంగా సోషల్ మీడియాలో తెలిపినప్పటికి కొంతమంది శ్రీరెడ్డి ని అదేపనిగా ట్రోల్ చేయడంతో లాయర్ ని సంప్రదించి పోలీసులను ఆశ్రయించింది . ఇప్పటికే పలువురిపై కేసు పెట్టగా మరికొందరిపై కూడా కేసు పెట్టడానికి సమాయత్తం అవుతోంది శ్రీరెడ్డి.