మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి


srireddy fire on saroj khan

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసి మళ్ళీ సోషల్ మీడియా లో దుమ్ము లేపుతోంది శ్రీరెడ్డి . సినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ పట్ల శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా ఈ విషయం బాలీవుడ్ కి సైతం పాకింది దాంతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ వ్యాఖ్యలపై స్పందించింది . కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉందని అయినా సినిమారంగంలో అమ్మాయిలను వాడుకున్నప్పటికీ సినిమాల్లో అవకాశాలు తప్పకుండా ఇస్తున్నారని అందులో పెద్దగా తప్పేమి లేదని కామెంట్ చేయడం సంచలనానికి దారి తీసింది .

ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్లు అలాగే శ్రీరెడ్డి కూడా . మీరంటే ఇంతకుముందు ఎంతో గౌరవం ఉండేది కానీ మీ మాటలు విన్న తర్వాత ఆ గౌరవం పోయిందని …… అయినా దర్శక నిర్మాతలకు తలొగ్గి ఉండటానికి మాకు ఆత్మాభిమానం లేదా ? అంటూ మండిపడుతున్నారు . ఛాన్స్ ఇస్తున్నారు కదా అని అందరి పక్కలో పడుకోలేము కదా ! అని ఫైర్ అవుతున్నారు పలువురు సినిమా రంగంలోని మహిళలు .