దిల్ రాజు , సురేష్ బాబు గుండెల్లో నిద్ర పోతానంటున్న శ్రీరెడ్డి


srireddy sensational comments on suresh babu and dil raju

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని థియేటర్ లని తమ గుప్పిట్లో పెట్టుకొని వందలాది మంది నిర్మాతలను రోడ్డున పడేలా చేసి, కొంతమంది చావుకు కారణమైన నియంతలు దిల్ రాజు , దగ్గుబాటి సురేష్ బాబు , అల్లు అరవింద్ లని వదిలి పెట్టేది లేదని వాళ్ళ గుండెల్లో నిద్ర పోతానని సవాల్ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . తెలుగు రాష్ట్రాలలో థియేటర్ ల సమస్య పట్టి పీడిస్తోంది . థియేటర్ లను లీజుకి తీసుకొని నిర్మాతల నుండి ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్నారు డబ్బులు . దాంతో పలువురు నిర్మాతలు సినిమాలు నిర్మించి మరీ రోడ్డున పడుతున్నారు .

ఇప్పటికే పలువురు చిన్న నిర్మాతలు థియేటర్ ల సమస్య ని పరిష్కరించమని అటు ప్రభుత్వాన్ని ఇటు ఫిలిం ఛాంబర్ పెద్దలను కోరుతున్నప్పటికీ ఆ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు . చిన్న నిర్మాతల పాలిట యమకింకరుల మాదిరిగా తయారయ్యారు దాంతో దిల్ రాజు , సురేష్ బాబు , అల్లు అరవింద్ లను చావుదెబ్బ కొడతానని , నన్నేం చేస్తారో చేసుకోండి…… నేను మీ గుండెల్లో నిద్రపోతా అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది శ్రీరెడ్డి . గతకొంతకాలంగా శ్రీరెడ్డి వివాదం చిత్రపరిశ్రమలో నలుగుతూనే ఉంది ఇక ఇప్పుడేమో దిల్ రాజు , సురేష్ బాబు లపై పడింది శ్రీరెడ్డి .