మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి


srireddy sensational comments on tollywood directors

తెలుగు చలన చిత్ర రంగంలో హోమో సెక్సువల్స్ ఉన్నారని మరో బాంబ్ పేల్చింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . గతనెల రోజుల పైనే చిత్ర పరిశ్రమ ని టార్గెట్ చేస్తూ రకరకాల ఆరోపణలు చేస్తూ పలువురు సెలబ్రిటీలను నిద్ర పోకుండా చేస్తోంది శ్రీరెడ్డి . ఈ భామ పేల్చుతున్న బాంబ్ లకు నిన్న మొన్నటి వరకు పలువురు సెలబ్రిటీ లు భయపడిపోయారు కట్ చేస్తే కొద్దిరోజులుగా శ్రీరెడ్డి కి అంతగా ప్రచారం లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు మరో బాంబ్ పేల్చి సరికొత్త వివాదాన్ని ముందు తెచ్చింది .

సినిమారంగంలో పలువురు దర్శకులు తమ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న మగాళ్ల తో స్వలింగ సంపర్కం చేస్తున్నారని సంచలన ట్వీట్ చేసింది శ్రీరెడ్డి . సినిమారంగంలో స్వలింగ సంపర్కులు ఉన్నారన్నది నిజమే అయితే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసింది శ్రీరెడ్డి . స్వలింగ సంపర్కులు ఉన్నారని చెప్పింది కానీ వాళ్ళ పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు ఈ వివాదాస్పద భామ . మొదట్లో శ్రీరెడ్డి కి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం కల్పించింది కట్ చేస్తే ఇప్పుడు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు .