పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని శపథం చేస్తున్న శ్రీరెడ్డి


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వచ్చే ఎన్నికల్లో ఒడిస్తానని అతడు ఎలా గెలుస్తాడో చూస్తానని మంగమ్మ శపథం చేస్తోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి సినిమాలను వదిలేసి రాజకీయాలపై పూర్తిగా కాన్ సన్ ట్రేట్ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనుకున్న సమయంలో జనసేన కూడా ఎక్కువ స్థానాలు పొందే అవకాశం ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.

అధికారంలోకి రాకపోయినా మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని భావిస్తున్నాడు పవన్ దాంతో అతడ్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి అయితే మొదట పవన్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఓటమి నా లక్ష్యం , అతడు ఎలా గెలుస్తాడో చూస్తా ? నా తుది రక్తపు బొట్టు వరకు అతడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అంటోంది శ్రీరెడ్డి.