తిప్పరా మీసంతో శ్రీవిష్ణు మీసం తిప్పుతాడా?


తిప్పరా మీసంతో శ్రీవిష్ణు మీసం తిప్పుతాడా?
తిప్పరా మీసంతో శ్రీవిష్ణు మీసం తిప్పుతాడా?

యంగ్ హీరో శ్రీవిష్ణు ఎంత టాలెంటెడ్ నటుడన్నది ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది క్రిటిక్స్ చాలా సందర్భాల్లో చెప్పేసారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ ఉంటేనే ఇక్కడ ఎవరి ఆటలైనా సాగేది, ఎవరి సినిమాలైనా చూసేది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించేసిన శ్రీవిష్ణుకి హిట్స్ మాత్రం తక్కువే. హిట్స్ వచ్చినా అవి వేరే హీరోతో షేర్ చేసుకున్నవే. శ్రీవిష్ణు సోలో గా హిట్ ఏదంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తిప్పరా మీసం అనే సినిమాతో ఈరోజు థియేటర్లలో అడుగుపెడుతున్నాడు శ్రీవిష్ణు. ఇన్నాళ్లూ క్లాస్ సినిమాలు మాత్రమే చేసిన ఇతను తొలిసారి బి, సి సెంటర్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేసాడు. తిప్పరా మీసం ప్రోమోలు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షో కూడా మొదలైపోయింది. కాసేపట్లో సినిమా రివ్యూ కూడా బయటకొస్తుంది.

శ్రీవిష్ణు కెరీర్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ముందుగా సోలో హీరోగా చేస్తున్నందుకు ఈ సినిమా అతనికి హిట్ కావాలి. అలాగే తొలిసారి మాస్ సినిమా ట్రై చేస్తున్నాడు. ఇన్నాళ్లూ శ్రీవిష్ణు ఎక్కువగా క్లాస్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. అందులో కూడా సటిల్ యాక్టింగ్ ఎక్కువగా కనిపించింది. ఈసారి పూర్తి మాస్ సినిమా చేసాడు. రస్టిక్ గా, రంగస్థలంలో రామ్ చరణ్ మాదిరి కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అయితే శ్రీవిష్ణు కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుంది.

ఆసియన్ సినిమాస్ ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. రవిప్రకాష్, నిక్కీ తంబోలి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి అసుర ఫేమ్ విజయ్ కృష్ణ దర్శకుడు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలో మదర్ ఎమోషన్ ఎక్కువగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. బ్రోచేవారెవరురా సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఈ చిత్రంతో బి, సి సెంటర్ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఆశిస్తున్నాడు. మరి తిప్పరా మీసం సినిమాతో నిజంగానే శ్రీవిష్ణు మీసం తిప్పుతాడేమో చూడాలి.