లెస్బియ‌న్ పాత్ర‌లో శృతిహాస‌న్‌!


లెస్బియ‌న్ పాత్ర‌లో శృతిహాస‌న్‌!
లెస్బియ‌న్ పాత్ర‌లో శృతిహాస‌న్‌!

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ న‌టించిన `ల‌స్ట్ స్టోరీస్‌` నెట్‌ఫ్లిక్స్‌లో ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో తెలిసిందే. దీని స్ఫూర్తిగా తీసుకుని `పిట్ట క‌థ‌లు` పేరు తో ఓ వెబ్ డ్రామాని నెట్‌ఫ్లిక్స్ త్వ‌ర‌లో తెలుగులో విడుద‌ల చేస్తోంది. నాలుగు భాగాలుగా తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌ని న‌లుగురు ద‌ర్శ‌కులు తెర‌కెక్కించారు.

నాగ్ అశ్విన్‌, నందినిరెడ్డి, సంక‌ల్ప్ రెడ్డి, త‌రుణ్ బాస్క‌ర్ ఈ `పిట్ట క‌థలు` సిరీస్‌ని రూపొందించారు. ఈ నాలుగు పిట్ట క‌థ‌ల్లో ల‌క్ష్మీ మంచు, శృతిహాస‌న్‌, అమ‌లా పాల్‌, ఈషా రెబ్బ, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌దేవ్‌, సంగీతా హెగ్డే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దీనికి సంబంధించిన టీజ‌ర్ ఈ బుధ‌వారం విడుద‌లైన విష‌యం తెలిసిందే.

ఇందులో రీసెంట్‌గా `క్రాక్‌` మూవీతో బంప‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న శృతీహాస‌న్ లెస్బియ‌న్‌గా క‌నిపించ‌బోతోంది. టీజ‌ర్‌లో ఓ అమ్మాయితో శృతి క‌నిపిస్తున్న స‌న్నివేశాలు `పిట్ట‌క‌థ‌లు` సిరీస్‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 19న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న విష‌యం తెలిసిందే.