గోపీచంద్‌ని శృతిహాస‌న్ క‌నిక‌రిస్తుందా?

గోపీచంద్‌ని శృతిహాస‌న్ క‌నిక‌రిస్తుందా?
గోపీచంద్‌ని శృతిహాస‌న్ క‌నిక‌రిస్తుందా?

దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైన `క్రాక్‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ విష‌యంలో గోపీచంద్ ఇందులో న‌టించిన శృతిహాస‌న్‌ని త‌న ల‌క్కీ మ‌స్కిట‌ర్‌గా భావిస్తున్నాడ‌ట‌. గ‌తంలో తాను రూపొందించిన `బ‌లుపు` చిత్రంలోనూ  శృతి హీరోయిన్‌గా న‌టించింది. ఆ మూవీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ద‌ర్శ‌కుడిగా గోపీచంద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

తాజాగా చేసిన `క్రాక్‌` కూడా కోవిడ్ వేళ త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డంతో సెంటిమెంట్‌గా భావిస్తున్నాడ‌ట‌. ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి శృతిహాస‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. `క్రాక్` త‌రువాత గోపీచంద్ మ‌లినేని నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ తో ఓ భారీ చిత్రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శృతిహాస‌న్‌ని న‌టింప‌జేయాల‌ని ఇప్ప‌టికే   సంప్రదించినట్లు చెబుతున్నారు.

అయితే శృతి.. 60 ఏళ్ల సీనియర్ స్టార్ అయిన బాల‌య్య‌తో జతకట్టడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.
శృతి ఇప్పటికే ప్రభాస్ తో క‌లిసి ‘సలార్’ చిత్రంలో న‌టిస్తోంది. `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్  ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.