శృతీహాస‌న్ పాట‌తో అద‌ర‌గొట్టిందిగా!Sruthi hasan pop song video goes viral

శృతీ‌హాస‌న్‌.. క‌మల్ హాస‌న్ గారాల ప‌ట్టిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అంత‌కు ముందే త‌నేంటో నిరూపించుకుంది. గాయ‌నిగా, సంగీత ద‌ర్శ‌కురాలిగా చిన్న వ‌య‌సులోనే త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క‌మ‌ల్ న‌టించిన క్ష‌త్రియ పుత్రుడు, హేరామ్‌`, భామ‌నే స‌త్య‌భామ‌నే, సూర్య న‌టించిన `సూర్య స‌న్నాఫ్ కృష్ణన్‌` చిత్రాల‌కు పాట‌లు పాడిన శృతిహాస‌న్ క‌మ‌ల్ న‌టించిన `ఈనాడు` (ఉన్నై‌పోల్ ఒరువ‌న్‌) తో సంగీత ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అయ్యింది.

ఆ త‌రువాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా శృతి సంగీతాన్ని మాత్రం వీడ‌లేదు. తాజాగా శృతిహాస‌న్ పాడిన పాట యూట్యూబ్‌లో అద‌ర‌గొట్టేస్తోంది. పాప్ సాంగ్స్ అంటే హాలీవుడ్ పాప్ సాంగ్స్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో శృతి పాడిన ఇంగ్లీష్ సాంగ్ హల్ చ‌ల్ చేస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో సెల‌బ్రిటీలంతా త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా శృతి స్వ‌యంగా ఓ పాట రాసి దానికి స్వ‌రాలు స‌మ‌కూర్చి తానే పాడ‌టం విశేషంగా చెబుతున్నారు.

`ఎడ్జ్‌` పేరుతో శృతి ఈ పాట‌ని త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. శృతిహాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా చివ‌రి ద‌శ‌లో ఆగిపోయింది.