ప‌వ‌న్‌, మ‌హేష్‌ల‌ని కామెంట్ చేసిన శృతి!

Sruthi hassan coments on Pawana kalyan and mahesh babu
Sruthi hassan coments on Pawana kalyan and mahesh babu

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ న‌టించిన చిత్రం `క్రాక్‌`. గోపీ చంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి శృతికి బిగ్ క‌మ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్‌తో క‌లిసి `వ‌కీల్ సాబ్‌` చిత్రంలో న‌టించింది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈసంద్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అబిమానుల‌తో ప్రత్యేకంగా ముచ్చ‌టించింది శృతిహాస‌న్‌. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిర విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్న శృతి నిద్ర‌, నిజం, కౌగిలింత‌లు త‌న‌ని అమితంగా సంతోషాన్నిస్తాయ‌ని తెలిపి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే కాకుండా త‌ను క‌లిసి న‌టించిన స్టార్ హీరోలు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబుల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబుల గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే ఏమ‌ని చెబుతార‌ని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌లు ట‌క్కున స‌మాధానం చెప్పేసింది. మ‌హేష్ ప‌క్కా జెంటిల్‌మెన్ అని ఇక ప‌వ‌న్ గురించి చెప్పాలంటే అత‌నో ఇతిహాసం అంటూ ప‌వ‌ర్‌స్టార్‌ని ఆకాశానికి ఎత్తేసింది. దీంతో ప‌వ‌న్, మ‌హేష్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.