శృతిహాస‌న్ ఎక్క‌డా త‌గ్గ‌నంటోందిగా!శృతిహాస‌న్ ఎక్క‌డా త‌గ్గ‌నంటోందిగా!
శృతిహాస‌న్ ఎక్క‌డా త‌గ్గ‌నంటోందిగా!

క్రేజీ హీరోయిన్ శృతిహాస‌న్ ఎక్క‌డా త‌గ్గ‌నంటోంది. ఇటీవ‌ల త‌మిళ ఫిల్మ్ `లాభం` మూవీ ఆన్ లొకేష‌న్ నుంచి స‌డ‌న్‌గా వెళ్లిపోయి షాకిచ్చిన శృతి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. కొంత వార‌మం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన శృతి తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌` మూవీతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాబోతున్నారు. ఈ మూవీతో పాటు శృతిహాస‌న్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇటీవ‌లే ఈ చిత్రాన్ని పునః ప్రారంభించారు.

ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్‌కి జోడీగా శృతిహాస‌న్ క‌నిపించ‌బోతోంది. అయితే ఇందు కోసం శృతి ఫుల్ అమౌంట్‌ని ఛార్జ్ చేస్తోంద‌ట‌. ప‌వ‌న్ ప‌క్క‌న గ్లామ‌ర్ బేబీ అవస‌రం కాబ‌ట్టి అది కూడా అతిథి పాత్ర కావ‌డంతో శృతిహాస‌న్ డిమాండ్‌కి త‌గ్గ‌ట్టుగా దిల్ రాజు పారితోషికాన్ని అందిస్తున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.