శృతిహాస‌న్ ఆ సినిమా చేయ‌డం లేదా?


శృతిహాస‌న్ ఆ సినిమా చేయ‌డం లేదా?
శృతిహాస‌న్ ఆ సినిమా చేయ‌డం లేదా?

కొంత విరామం త‌రువాత శృతిహాస‌న్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించడం మొద‌లుపెట్టింది. మైఖేల్ కోర్స‌ల్‌తో  డేటింగ్ చేసిన శృతి కొంత కాలం సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చింది. అత‌నికి బ్రేక‌ప్ చెప్పిన త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించింది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో న‌టిస్తున్న శృతి తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌` మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే శృతిహాస‌న్ ప‌వ‌ర్‌స్టార్ తో క‌లిసి `వ‌కీల్ సాబ్‌` చిత్రంలో మెర‌వ‌నుంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తాజాగా తెలుస్తోంది.

ఇటీవ‌ల ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన శృతిహాస‌న్ త‌ను తెలుగులో చేస్తున్న `క్రాక్‌` మూవీతో పాటు త‌మిళ చిత్రం `లాభం` గురించి వివ‌రాల్ని వెల్ల‌డించింది. ఆ త‌రువాత త‌ను చేయ‌బోతున్న చిత్రాల గురించి వెల్ల‌డించింది. కొన్ని చిత్రాలు చ‌ర్చ‌ల ద‌శ‌లోవున్నాయ‌ని, వాటి గురించి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాన‌ని వెల్ల‌డించింది. కానీ `వ‌కీల్ సాబ్‌`లో త‌ను న‌టిస్తున్న‌ట్టు మాత్రం వెల్ల‌డించ‌లేదు. దీంతో శృతిహాస‌న్ `వ‌కీల్‌సాబ్‌`లో న‌టించ‌నుంద‌న్న వార్త‌లో నిజం లేద‌ని తెలుస్తోంది.