నెట్‌ఫ్లిక్స్ కోసం రానా, శృతిహాస‌న్‌?


నెట్‌ఫ్లిక్స్ కోసం రానా, శృతిహాస‌న్‌?
నెట్‌ఫ్లిక్స్ కోసం రానా, శృతిహాస‌న్‌?

గ‌త ఏడు నెల‌లుగా సినీ ఇండ‌స్ట్రీ తీవ్ర సంక్షోభానికి గుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది ఓటీటీ ప్లాట్ ఫామ్‌. డిజిట‌ల్ ప్ర‌పంచం లాక్‌డౌన్ కార‌ణంగా భారీ స్థాయిలో వీవ‌ర్స్‌ని ఆక‌ట్టుకోవ‌డం మొద‌లుపెట్టింది. దీనికి తోడు థియేట‌ర్లు రీఓపెన్ కాక‌పోవ‌డంతో క్రేజీ సినిమాల‌న్నీ ఓటీటీల బాట‌ప‌ట్టాయి. వీవ‌ర్స్ షిప్ పెరిగిపోవ‌డం, వెబ్ సిరీస్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టంతో క్రేజీ స్థార్‌లు కూడా డిజిల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు.

ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇందులో రానా, శృతిహాస‌న్ క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ రైట‌ర్ ఈ వెబ్ డ్రామాకు క‌థ అందిస్తున్నార‌ట‌. మొత్తం ప‌ది ఎపిసోడ్‌లుగా నిర్మితం కానున్న ఈ వెబ్ సిరీస్‌ని తెలుగుతో పాటు ప‌ది భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఈ వెబ్ సిరీస్‌ని ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు?.. ఎప్పుడు మొద‌ల‌వుతుంది.. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎవ‌రు అన్న విష‌యాల్ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే అధిక‌రికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది. శృతిహాస‌న్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న `ల‌స్ట్ స్టోరీస్‌` తెలుగు వెర్ష‌న్‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే దీనికి సంబంధించిన షూటింగ్‌ని హైద‌రాబాద్‌లో పూర్తి చేశారు కూడా.