
మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` ఈ సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీలోనూ ఈ మూవీ భారీ వసూళ్లని సాధించడం గమనార్హం. గోపీచంద్ మలినేని, రవితేజల కాంబినేషన్లో ముచ్చటగా మూడవ సారి వచ్చిన ఈ చిత్రం ఈ కాంబినేషన్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందించింది. ఇందులో శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీతో శృతిహాసన్ దశ కూడా తిరిగినట్టు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ సన్నివేశంలో రవితేజకు మించి యాక్షన్ సీక్వెన్స్‌లో శృతి అదరగొట్టింది. ఇదే శృతిహాసన్‌కి బంపర్ ఆఫర్‌ని అందించినట్టు తెలుస్తోంది. `క్రాక్` హిట్‌తో మాంచి స్పీడుమీదున్న శృతికి ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`లో నటించే అవకాశం దక్కింది. నేడు శృతిహాసన్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా చిత్ర బృందం శృతిహాసన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ `సలార్`లోకి వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ ఆఫర్ శృతిహాసన్ కెరీర్‌కి బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం కోసం శృతికి చిత్ర బృందం భారీగానే ఆఫర్ చేశారట. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
View this post on Instagram