‘ప్రశాంతత లాంటి మనిషి’ అంటున్న యంగ్ టైగర్!


SS Rajamouli
SS Rajamouli

సూపర్(s) సక్సెస్ ఫుల్ (s) రాజమౌళి బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారనేది నమ్మలేని నిజం. తాను ఎదగటమే కాకుండా తెలుగు సినిమా రేంజ్ ను మరింత పెంచారాయన.. ఆల్ ఇండియా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు.

కొమరం బీమ్ , అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా, వారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్పైన అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు జక్కన్న. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ తార ఆలియాభట్‌ ఈ చిత్రంలో నటిస్తోంది. ఎన్ఠీఆర్ సరసన ఓ హాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసారని వినికిడి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ బల్గేరియాలోని జోద్పూర్లో జరుగుతుంది.

ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌ మీద యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.. షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఫొటోను తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎన్టీఆర్‌ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోకు ‘తుపాన్‌కు ముందు ప్రశాంతత లాంటి మనిషి’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు.. యంగ్ టైగర్ ఎన్ఠీఆర్. డివివి దానయ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2020 జులై 30న విడుదలకానుంది.. !

 

View this post on Instagram

 

The MAN before The STORM! #RRR

A post shared by Jr NTR (@jrntr) on