మహేష్ – రాజమౌళి ల చిత్రం 2020 లో


SS Rajamouli next film with Mahesh babu 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో టాలీవుడ్ జక్కన్న సినిమా అని ఎప్పటినుండో అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే కార్యరూపం దాల్చలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2020 లో మహేష్ బాబురాజమౌళి ల సినిమా ఉండనుందట . పైగా ఆ సినిమాతో మహేష్ బాబు ని బాలీవుడ్ కి పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న . మహేష్ బాబు ఇప్పటివరకు టాలీవుడ్ లో మాత్రమే నటిస్తున్నాడు . స్పైడర్ తో కోలీవుడ్ లో పరిచయం అయ్యాడు . కాకపోతే బాలీవుడ్ లో మాత్రం జక్కన్న ఫిలిం తోనే పరిచయం కానున్నాడట .

మహేష్ నటించిన పలు చిత్రాలు హిందీలో డబ్ అవుతున్నాయి కానీ నేరుగా మాత్రం చేయలేదు . ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు . ఆ సినిమా 2019 ఎండింగ్ వరకు జరుగుతుంది ఇక రిలీజ్ మాత్రం 2020 లోనే అందుకే ఆ సినిమా విడుదల అయ్యాక మహేష్ బాబుతో త్రిభాషా చిత్రం చేయడం ఖాయమని అంటున్నారు . రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉంది కాబట్టి దానికి మహేష్ ఇమేజ్ యాడ్ అయితే ఇక చెప్పేదేముంది .

English Title: SS Rajamouli next film with Mahesh babu