ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోన్న రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోన్న రాజమౌళి
ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోన్న రాజమౌళి

కరోనా సెకండ్ వేవ్ పీక్ దాటిపోయింది. నెమ్మదిగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. పరిస్థితులు అదుపులోకి రాబోతున్నాయి. ఇలా పాజిటివ్ అంశాలు ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లాలనుకుంటోంది. నెమ్మదిగా షూటింగులు మొదలవుతున్నాయి. జులై నుండి అన్ని సినిమాల షూటింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

ఆగస్ట్ నుండి థియేటర్లు మళ్ళీ 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయని టాలీవుడ్ భావిస్తోంది. దాని ప్రకారంగా రిలీజ్ డేట్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే భారతదేశంలోకి అత్యంత భారీ చిత్రం తీస్తోన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ షెడ్యూల్ ను ప్లాన్  చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ ఫైనల్ షెడ్యూల్ మొదలుకానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ఈ ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఒక సాంగ్, కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆర్ ఆర్ ఆర్ ఫ్రెష్ రిలీజ్ డేట్ పై ఇంకా సమాచారం రావాల్సి ఉంది.