ఆర్ ఆర్ ఆర్ అన్ని రికార్డులను బద్దలు కొట్టే సినిమానట


SS Rajamouli revealed about RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రాంచరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . కాగా ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తిచేసుకుంది . ఇక ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడని రాజమౌళి తాజాగా నోరు విప్పాడు ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీ అంటూ .

 

ఈ సినిమాకు ఉత్తర భారతం , దక్షిణ భారతం అనే తేడా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందని సరికొత్త రికార్డులకు కేంద్ర బిందువు అవుతుందని అంటున్నాడు . అసలే ఎన్టీఆర్ – రాంచరణ్ లు అంటే ఊర మాస్ హీరోలు వాళ్లకు రాజమౌళి తోడైతే ఇంకా కొత్తగా చెప్పేదేముంది . పైగా బాహుబలి తో రాజమౌళి ఎల్లలు లేని కీర్తిని ఆర్జించాడు దాంతో ఆర్ ఆర్ ఆర్ అన్ని రికార్డులను బద్దలు కొట్టే సినిమా అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు .

 

English Title: SS Rajamouli revealed about RRR