రాజమౌళి కి నచ్చకపోయినా ట్వీట్ చేసాడట


SS Rajamouli reveales intresting things
S. S. Rajamouli

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తనకు కొన్ని సినిమాలు నచ్చకపోయినప్పటికీ బాగున్నాయని ట్వీట్ చేయాల్సి వచ్చిందని , అలాంటి సినిమా లిస్ట్ బయట పెట్టాల్సి వస్తే చాలా ఉన్నాయని అంటున్నాడు జక్కన్న . ఏదైనా సినిమా విడుదల అవుతోందంటే చాలు రాజమౌళి ఆ సినిమాలపై ట్వీట్ లు పెడుతూనే ఉంటాడు . అయితే అందులో హిట్ అయినవి కొన్నే ఉన్నాయి మిగతా చిత్రాలు ప్లాప్ అయ్యాయి .

అయితే నేను చేసిన ట్వీట్ లు నిజంగా సినిమాపై నమ్మకంతో చేయలేదని కేవలం మొహమాటం కోసం చేసినవి ఉన్నాయని కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సందర్బంగా చెప్పాడు జక్కన్న . ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రాంచరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు . తెలుగు , తమిళ , మలయాళ , హిందీ బాషలలో ఆ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు . షరా మాములుగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు .

English Title : SS Rajamouli reveales intresting things