యూట్యూబ్ ను షేకాడిస్తున్న థమన్


యూట్యూబ్ ను షేకాడిస్తున్న థమన్
యూట్యూబ్ ను షేకాడిస్తున్న థమన్

ప్రస్తుతం సినిమాల గురించి చర్చ వస్తోందంటే వాళ్ళు కచ్చితంగా థమన్ గురించి కూడా ప్రస్తావించుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా థమన్ హవానే నడుస్తోంది. థమన్ సంగీతం అందించిన నాలుగు సినిమాలు తక్కువ వ్యవధిలో విడుదలవుతుండడంతో థమన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. థమన్ ప్రస్తుతం ప్రతిరోజూ పండగే, అల వైకుంఠపురములో, వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. వెంకీ మామ డిసెంబర్ 13న, ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న, అల వైకుంఠపురములో జనవరి 12న, డిస్కో రాజా జనవరి 24న విడుదలవుతున్నాయి. ఇవన్నీ తక్కువ గ్యాప్ లో విడుదలవుతుండడం వల్ల వీటికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఏది విడుదలైనా కూడా టాప్ లో ట్రెండ్ అవుతూ సెన్సేషన్ సృస్తిస్తున్నాయి.

అల వైకుంఠపురములో విషయాన్నే తీసుకుంటే ఈ సినిమా నుండి వస్తోన్న పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. సామజవరగమన, రాములో రాముల పాటలు 100 మిలియన్, 70 మిలియన్ వ్యూస్ ను దాటి మరింత ముందుకెళ్తున్నాయి. లైకులు కూడా లక్షల్లో వస్తున్నాయి. అల వైకుంఠపురములో అనే కాక పైన చెప్పుకున్న మిగతా సినిమాలు ఏవైనా కానీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. థమన్ పేరు మార్మోగిపోతోంది.

ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న టాప్ 6 వీడియోల్లో మూడు సినిమాలకు సంగీతం అందించింది థమన్ కావడం విశేషమే. ఇదివరకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే ట్రోల్ పేజెస్ రెడీగా ఉండేవి. ఎన్ని డప్పులు కొట్టాడో, ఎంత రొటీన్ సంగీతం అందించాడోనని, అయితే రెండేళ్ల క్రితం థమన్ తనను తాను ఆవిష్కరించుకున్నాడు. తొలిప్రేమ, మహానుభావుడు, mr. మజ్ను, అరవింద సమేత వంటి సినిమాల్లో తన సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ నాలుగు సినిమాలతో మరో స్థాయికి వెళతాడనడంలో సందేహం లేదు.