టాప్ ప్రయారిటీతో దూసుకుపోతున్న థమన్

టాప్ ప్రయారిటీతో దూసుకుపోతున్న థమన్
టాప్ ప్రయారిటీతో దూసుకుపోతున్న థమన్

సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఇప్పుడు టాలీవుడ్ లో నెం 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇన్నాళ్లూ దేవి శ్రీ ప్రసాద్ ఈ స్థానాన్ని అనుభవించగా ఇప్పుడు థమన్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ బడా ప్రాజెక్ట్ మొదలవుతున్నా దానికి థమన్ ను సంగీత దర్శకుడిగా కన్సిడర్ చేస్తున్నాడు.

చిరంజీవి లూసిఫెర్ రీమేక్, రామ్ చరణ్ – శంకర్ చిత్రం, వేణు శ్రీరామ్, అల్లు అర్జున్ ఐకాన్ ల చిత్రాలకు థమన్ ను కన్సిడర్ చేస్తున్నారు.  మహేష్ బాబు రానున్న రెండు సినిమాలకు కూడా థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. బాలకృష్ణ అఖండకు పనిచేస్తున్న థమన్, బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమాలకు కూడా వర్క్ చేయనున్నాడు.

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత థమన్ తన ఫీజ్ ను కూడా హైక్ చేసాడు. అసలు బ్రేకుల్లేకుండానే థమన్ నిరంతరం పనిచేస్తున్నాడు. పైన పేర్కొన్న ప్రాజెక్ట్స్ కాకుండా మరో డజను సినిమాలకు పైగా థమన్ పనిచేస్తున్నాడు.