ఊహించిన‌ట్టే అనౌన్స్‌మెంట్‌!


ఊహించిన‌ట్టే అనౌన్స్‌మెంట్‌!
ఊహించిన‌ట్టే అనౌన్స్‌మెంట్‌!

మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ త‌రువాత యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నారంటూ గ‌త కొన్ని నెల‌లుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ క‌థ‌నాల‌పై మేక‌ర్స్ సైలెంట్‌గా వుంటూ త‌మ ప‌ని తాము చూసుకుంటూ వెళ్లిపోయారు. తాజాగా ప‌ర‌శురామ్‌తో మ‌హేష్‌ నెక్స్ట్ మూవీ వుంటుంద‌ని వెల్ల‌డిస్తూ ఎట్ట‌కేల‌కు అంతా ఊహించిన‌ట్టే అనౌన్స్‌మెంట్ చేశారు.

#SSMB27వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని ఈ ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నారు. లాక్‌డౌన్ త‌రువాత ప్రారంభం కాబోతున్న తొలి స్థార్ హీరో సినిమా కావ‌డంతో ఈ సినిమా లాంచింగ్ కోసం ఇండ‌స్ట్రీ అంతా వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తున్న‌ట్టు టైటిల్‌ని కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చిత్ర బృందం ఇండైరెక్ట్‌గా వెల్ల‌డించింది.

ముందు నుంచి చెబుతున్న‌ట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. శ‌నివారం ఈ మూడు సంస్థ‌లు సంయుక్తంగా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఈ విష‌యం స్ప‌ష్టం అయింది. ఈ చిత్రానికి `స‌ర్కారు వారి పాట‌` అనే టైటిల్‌ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీన్నే ఆదివారం ప్ర‌క‌టించ‌బోతున్నారు.