స్టాలిన్ మళ్ళీ రంగం లోకి వస్తాడా.?


Stalin Andharivadu movie
Stalin Andharivadu movie

“రంగం” సినిమాతో తెలుగు లో సూపర్ సక్సెస్ తోపాటు మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న యువ నటుడు “జీవా” అనువాద సినిమాలు మళ్ళీ ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు చేరువ కాలేదు. రంగం సినిమా కంటే ముందు కూడా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన “ఈ” సినిమాను కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరించారు. తమిళం తప్ప, తెలుగు మార్కెట్ పై ఫోకస్ చెయ్యని తమిళ నటులు అందరూ… ఇటీవల తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన కార్తీ సూపర్ హిట్ మూవీ ఖైదీ తర్వాత మళ్ళీ తమ తెలుగులో కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

జీవా నటించిన తాజా చిత్రం “సీరు” సినిమాను తెలుగులో “స్టాలిన్ అందరివాడు” అని చిరంజీవి గారి రెండు సినిమాల టైటిల్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగు యువనటుడు నవదీప్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ రూపంలో ఈ సినిమాలో డిస్కస్ చేసిన ఐడియాస్ చాలా డీప్ ఫిలాసఫీ ని ఇండికేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా విలన్ చెప్పే

“ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నప్పుడు బయట నుండి చూసే వాడు మధ్యలో కల్పించుకుని వస్తే యుద్ధం తొందరగా ముగిసిపోతుంది” అంటాడు .

హీరో డైలాగ్స్ అయిన,

· “సహయం అనేది మనిషి వీపు పై ఉండే పుట్టుమచ్చ లాంటిది. అది కనపడనంత మాత్రాన లేదనుకోవడం, మర్చిపోవడం చాలా పెద్ద తప్పు.”

· “ఫ్రెండ్ అంటే ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ కి లైక్ ఇచ్చే వాడు కాదు.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లైఫ్ ఇచ్చే వాడు..”

· “బయట ప్రపంచం తో చేసే యుద్ధంలో నువ్వు ఓడిపోయినా ఫర్వాలేదు.. కానీ నీతో నీకు జరిగే యుద్ధంలో ఎప్పుడూ నువ్వు ఓడిపోకూడదు.”

ఇలాంటి సినిమాలు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యి, హిట్ అవ్వకపోయినా, కనీసం కొన్న వాళ్ళకు సేఫ్ ప్రాజెక్ట్ అయితే బాగుటుంది.