మద్యానికి బానిసైన స్టార్ యాంకర్


star anchor kapil sharma in depressionఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత చాన్స్ వెలుగు లు లేకపోవడంతో డిప్రెషన్ కి లోనై పూర్తిగా మద్యానికి బానిస అయ్యాడట ! ఇప్పుడు ఎప్పుడు చూడు మద్యం తాగుతూ భవిష్యత్ ఏంటో అర్ధం కాక తెగ ఇదై పోతున్నాడట ! ఇంతకీ డిప్రెషన్ కి లోనై మద్యానికి బానిస అయిన స్టార్ యాంకర్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ? కపిల్ శర్మ . హిందీ లో స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన కపిల్ శర్మ . ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు అతడికి యాంకర్ గా వచ్చిన స్టార్ డంతో . హీరోలతో సమానంగా స్టార్ డం పొందిన కపిల్ శర్మ పరిస్థితి ఇలా తలకిందులు కావడానికి కారణం ఏంటో తెలుసా …….

హిందీలో కపిల్ శర్మ యాంకర్ గా చేసిన పలు షోలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో తమ సినిమా ప్రమోషన్ కు తప్పకుండా కపిల్ శర్మ షోలకు వెళ్ళేవాళ్ళు బాలీవుడ్ ప్రముఖులు . అయితే షోలు బ్లాక్ బస్టర్ కావడంతో కపిల్ రేంజ్ పెరిగింది అలాగే కాస్త అహంకారం కూడా పెరిగినట్లుంది దాంతో వెటకారంగా మాట్లాడటం చేసేవాడు అది తీవ్ర రూపం దాల్చడంతో చాలామంది ఎదురు తిరిగారు కూడా కట్ చేస్తే కపిల్ శర్మ పై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఏ చానల్ వాళ్ళు కూడా అతడికి చాన్స్ ఇవ్వలేదు దాంతో ఒక్కసారిగా అదఃపాతాళానికి పడిపోయాడు దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు . ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది . నిత్యం మందు తో సహవాసం చేస్తున్నాడట .

English Title: star anchor kapil sharma in depression