టాప్ హీరో ఫిల్మ్‌కి సంబంధించి 27 సభ్యుల‌కు పాజిటివ్!

టాప్ హీరో ఫిల్మ్‌కి సంబంధించి 27 సభ్యుల‌కు పాజిటివ్!
టాప్ హీరో ఫిల్మ్‌కి సంబంధించి 27 సభ్యుల‌కు పాజిటివ్!

కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ ని అంత త్వ‌ర‌గా వ‌డిచి పెట్టేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఈ ద‌ఫా ప్ర‌కంప‌ణ‌లు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తొలి వేవ్ సంద‌ర్భంగా చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే సోకిన కోవిడ్ సెకండ్ వేవ్‌లో మాత్రం విజృంభిస్తోంది. ప్ర‌తీ ఒక్క‌రినీ తాక‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల నివేదా థామ‌స్‌, దిల్‌రాజు, త్రివిక్ర‌మ్‌, విజ‌యేంద్ర ప్ర‌సాద్ వంటి వారు కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

అదే విధంగా త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది కార‌ణంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్వారెంటైన్‌కి ప‌రిమిత‌మైపోయారు. బండ్ల గ‌ణేష్ మ‌రోసారి కోవిడ్ బారిన ప‌డ్డారు. ఇదిలా వుంటే టాలీవుడ్ సర్కిల్స్‌లో తాజా ఓ షాకింగ్ న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఓ ప్రముఖ హీరోకు సంబంధించిన మూవీ షూటింగ్‌లో అకస్మాత్తుగా 27 మంది సిబ్బంది కరోనా వైరస్ సోకిన‌ట్టు తెలిసింది. దీంతో షూటింగ్‌ని నిలిపివేశార‌ట‌. ఈ చిత్రం షూటింగ్‌లో 27 మంది సిబ్బందికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలినట్లు చెబుతున్నారు.

దీంతో స్టార్ హీరో, చిత్ర ద‌ర్శ‌కుడితో పాటు మిగిలిన యూనిట్ సభ్యులు ముందుజాగ్రత్త చర్యగా స్వీయ నిర్భంధంలోకి వెళ్ళార‌ట‌. ప్రస్తుతానికి నటుడి ఆరోగ్య స్థితిపై ఎటువంటి స‌మాచారం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సమ్మర్ రిలీజ్ కోసం పోటీలో ప‌డుతోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.