లాక్‌డౌన్ వేళ కిడ్‌గా మారిన సూప‌ర్‌స్టార్‌!


లాక్‌డౌన్ వేళ కిడ్‌గా మారిన సూప‌ర్‌స్టార్‌!
లాక్‌డౌన్ వేళ కిడ్‌గా మారిన సూప‌ర్‌స్టార్‌!

క‌రోనా వైర‌స్ విళ‌యాన్ని సృష్టిస్తోంది. ఏ దేశం ప‌రిస్థితి చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. ప్ర‌పంచం న‌లుమూల‌ల చాప‌కింద నీరులా పాకిపోతోంది. ప్ర‌భుత్వాల‌కి, ప్ర‌జ‌ల‌కి ఏం చేయాలో దిక్కుతోచ‌డం లేదు. ప్ర‌పంచం మొత్తం యాక్టీవ్‌గా వున్న శాఖ‌లు మూడే. ఒక‌టి డాక్ట‌ర్లు, రెండు పోలీస్ వ్య‌వ‌స్థ‌, మూడు ప్ర‌భుత్వ యంత్రాంగం. ఎక్క‌డి క‌క్క‌డ జ‌నజీవితం స్థంభించిపోయింది. రేపు.. ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో.. ఏ జ‌ర‌గ‌బోతుందో తెలియ‌ని అయోమ‌య స్థితి.

ఈ ప‌రిస్థితితో మార్పు రావాలంటే లాక్ డౌన్ ఒక్క‌టే దీనికి ప‌రిష్కారం అని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్‌ని ప‌గ‌డ్బందీగా అమ‌లు చేస్తున్నాయి. దీంతో స‌ర్వం బంద్ అయిపోయాయి. సినిమా షూటింగ్‌లు లేవు. థియేట‌ర్లు లేవు. ఇల్లే థియేట‌ర్‌, ఇళ్లే స‌ర్వ‌స్వం. దీంతో మ‌హా మ‌హులు, సామాన్యులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. సూప‌ర్‌స్టార్ మహేష్ కూడా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని పిల్ల‌ల‌తో గ‌డిపేస్తున్నారు.

అయితే పిల్లతో త‌ను కూడా కిడ్‌గా మారిపోయాడు. పిల్ల‌ల‌కి అత్యంత ఇష్ట‌మైన చిత్రం `స్టూవ‌ర్ట్ లిటిల్‌`. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి చూడ‌టం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. `స్టూవ‌ర్ట్ లిటిల్‌` స్ట్రీమింగ్ అవుతోంది. లాక్ డౌన్ వేళ పార్ట్ 2ని చూడ‌టానికి వేచి వుండ లేము. ఇంట్లో వాళ్ల‌కి మ‌నం చేయ‌ద‌గ్గ ప‌ని ఏదైనా వుంటే చేసేద్దాం. అలా చేస్తే మ‌న‌కు ప్రియ‌మైన వారు ఆనందిస్తారు. #StayHomeStaySafe అని మ‌హేష్ ఇన్ స్టాలో షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

Credit: Instagram