దేవి ఎలిమినేషన్ వెనుక ఎవరున్నారు?


దేవి ఎలిమినేషన్ వెనుక ఎవరున్నారు?
దేవి ఎలిమినేషన్ వెనుక ఎవరున్నారు?

గత ఆదివారం బిగ్ బాస్ ఇంటి నుండి దేవి ఎలిమినేట్ కావ‌డం చర్చనీయాంశంగా మారింది. కుమార్ సాయి, మెహబూబ్ వంటివారు ఈ వారం ఎలిమినేషన్ నుండి రక్షించబడ‌టం, దేవి నాగవల్లి మాత్ర‌మే ఎలిమినేట్ కావ‌డం కొంతమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి కుమార్ సాయి కంటే దేవి  బలమైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే, ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి చాలా కార‌ణాలే వున్న‌ట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఇంట్లోకి దేవి ప్రవేశించడానికి ముందే ఓ స్టార్ హీరో అభిమానులు అమెని ఎలిమినేట్ చేసేలా ఓటింగ్ చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. దేవి ఎప్పుడు నామినేష‌న్‌లోకి వ‌స్తుందా? అప్ప‌టి నుంచి అమెకు వ్య‌తిరేకంగా ఓటింగ్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇదే అద‌నుగా దేవి నామినేట్ కావ‌డంతో ఓటింగ్ చేసి మొత్తానికి దేవిని బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి పంపించేశార‌ట‌.

దేవి బ‌య‌టికి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆమె టీవి 9లో ప‌నిచేయ‌డ‌మేనిన చెబుతున్నారు. గ‌తంలో స‌ద‌రు చాన‌ల్ స్టార్ హీరోపై వ‌రుస క‌థ‌నాల్ని ప్ర‌సారం చేసింది. ఆ మ‌ధ్య న‌టి, బీజేపీ నేత మాధ‌వీల‌త స‌ద‌రు హీరో ఫ్యాన్స్‌పై చేసిన‌న వ్యాఖ్య‌ల్ని టీవి9 ప‌దే ప‌దే ప్ర‌సారం చేసింది. దీంతో ఆ చాన‌ల్‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన స‌ద‌రు హీరో ఫ్యాన్స్ ఆ చాన‌ల్‌ని, ఆ చాన‌ల్‌లో ప‌నిచేస్తున్న వారిని టార్గెట్ చేశార‌ని, అందులో బాగంగానే దేవిని నామినేట్ చేశార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.