ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్ప‌నున్న‌స్టార్ హీరో?ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్ప‌నున్న‌స్టార్ హీరో?
ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్ప‌నున్న‌స్టార్ హీరో?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వున్న సీనియ‌ర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్‌. ఈ న‌లుగురు హీరోలు గత మూడున్న ద‌శాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తూనే వున్నారు. త‌రం మారినా యువ హీరోల‌కు ధీటుగా అప్‌డేట్ అవుతూ వ‌రుస విజ‌యాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. అయితే ఈ న‌లుగురు హీరోల్లో కొంత మందికి గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యాలు ద‌క్క‌డం లేదు. అయినా స‌రే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ రేసులో నిలుస్తున్నారు.

అయితే ఈ న‌లుగురు సీనియ‌ర్ హీరోల్లో ఒక హీరో సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఇండ‌స్ట్రీ నుంచి త‌ప్పుకోవాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రు? .. చిరంజీవినా, బాల‌కృష్ణ‌నా, నాగార్జున నా లేక విక్ట‌రీ వెంక‌టేషా? అంటే విక్ట‌రీ వెంక‌టేష్ అనే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా ఆయ‌న సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని త‌న వాళ్ల‌కి కూడా చెప్పాన‌ని, అయితే అందుకు వారు అంగీక‌రించ‌డం లేద‌ని గురువారం త‌న‌ని క‌లిసిన మీడియాతో విక్ట‌రీ వెంక‌టేష్ వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త ఐదేళ్లుగా సినిమాల‌కు గుడ్ బై చెప్పి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌నుకుంటున్నాన‌ని, అయితే నా మాట‌ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, మా వాళ్లు మ‌రీ విన‌డం లేద‌ని వెంక‌టేష్‌ చెప్పుకొచ్చారు.

నేను రిటైర్ అవ్వాల‌నుకుంటుంటే మా వాళ్లేమో ఇంకా న‌టించాల‌ని ఏవేవో డిజైన్ చేస్తున్నార‌ని, మొద‌ట్లో సినిమాల్లోకి రావాల‌ని త‌న‌కు అస్స‌లు లేద‌ని, అయితే త‌ను అనుకున్న‌దానికి భిన్నంగా త‌న జీవితం సాగుతోంద‌ని, కనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వ‌ని, కొన్ని వ‌ద్ద‌నుకున్నా వ‌చ్చేస్తుంటాయ‌ని, టైమ్ అన్నింటిని న‌డిపిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. గ‌తంతో పోలిస్తే సినిమా బిజినెస్‌లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా మార్పులొచ్చాయ‌ని, కాలంతో పాటు మ‌న‌మూ మారాల‌న్నారు. కొన్ని సంద‌ర్భాల్లో కంటెంట్‌తో పాటు కాంబినేష‌న్ కూడా వర్క‌వుట్ అవుతుంద‌ని, `వార్‌`సినిమా విష‌యంలో కంటెంట్ క‌న్నా కాంబినేష‌నే ఎక్కువ‌గా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని, అదే మా సినిమా విష‌యంలోనూ ప‌నిచేస్తుంద‌ని భావిస్తున్నాన‌ని చెప్పారు.

`అసుర‌న్‌` తెలుగు రీమేక్ గురించి మాట్లాడుతూ `జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని, స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాని చెప్పారు. ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల ఈ సినిమా విష‌యంలో మంచి క‌సితో వున్నాడ‌ని, ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని పూర్తి చేసిన శ్రీ‌కాంత్ అడ్డాల ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకోవాల‌నే త‌పన‌తో వ‌ర్క్ చేస్తున్నాడ‌ని వెల్ల‌డించారు.