కూలీలుగా మారిన స్టార్ హీరోలు


Star heroes turned railway coolies

స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు కూలీలుగా మారారు . వెంకటేష్ కూలీ నెంబర్ 1 గా అవతారం ఎత్తగా , వరుణ్ తేజ్ మాత్రం కూలీ నెంబర్ 786 గా మారాడు . ఈ ఇద్దరూ ఇలా ట్యాగ్ లు పెట్టుకోవడానికి ఓ రీజన్ కూడా ఉంది . వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ” కూలీ నెంబర్ 1 ” కాగా చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ” ఖైదీ నెంబర్ 786 ” . చిరు వరుణ్ తేజ్ కు పెద్ద నాన్న కాబట్టి ఈ ట్యాగ్ పెట్టుకున్నాడు . కాగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ” F 2” . వరుస విజయాలు సాధిస్తున్న యువ దర్శకులు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎఫ్ 2 చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు . 2019 లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

యాక్షన్ తో పాటుగా వినోదానికి అగ్ర తాంబూలం ఇస్తాడు అనిల్ రావిపూడి . తను ఇంతకుముందు దర్శకత్వం వహించిన ” పటాస్ ” , ”సుప్రీమ్ ” , ” రాజా ది గ్రేట్ ” చిత్రాల్లాగే ఈ ఎఫ్ 2 ని కూడా వినోద ప్రధానంగా రూపొందిస్తున్నాడట . వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ సరసన మెహరీన్ కౌర్ నటిస్తోంది . కూలీలుగా మారిన హీరోలు అంటూ అనిల్ రావిపూడి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది .

English Title: Star heroes turned railway coolies