భ‌య‌మే ఆ వ్యాధికి స‌రైన మందు!భ‌య‌మే ఆ వ్యాధికి స‌రైన మందు!
భ‌య‌మే ఆ వ్యాధికి స‌రైన మందు!

పెళ్లి త‌రువాత నుంచి సినిమాల ఎంపిక విష‌యంలో త‌న పంథాను మార్చుకున్నారు క్రేజీ క‌థానాయిక స‌మంత‌. క‌థానాయిక ప్రాధాన్యం వున్న చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తూ వ‌స్తున్నారామె. ఇటీవ‌ల ఆమె న‌టించిన `మ‌జిలీ`, ఓ బేబీ వంటి చిత్రాల న‌ట‌న‌కు ఆస్కారం వున్న‌వే. ప్ర‌స్తుతం `జాను` చిత్రంతో పాటు హిందీలో రూపొందుతున్నవెబ్ సిరీస్ `ఫ్యామిలీమ్యాన్ 2`లో స‌మంత న‌టిస్తోంది. ఇవి చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఇందులో `96` ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న `జాను` టీజ‌ర్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే స‌మంత ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ప్ర‌త్యూషా ఫౌండేష‌న్ పేరుతో గ‌త కొంత కాలంగా ఓ సేవా సంస్థ‌ని ర‌న్ చేస్తున్నారామె. గుండె సంబంధిత వ్య‌ధితో బాధ‌ప‌డుతున్న కొంత మంది పిల్ల‌ల‌కు హార్ట్ ఆపరేఫ‌న్‌లు చేయించారు కూడా. సున్నిత‌మైన విష‌యాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా సూటిగా స్పందించే స‌మంత గ‌త కొంత కాలంగా స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుల‌పై ఘాటుగా స్పందించారు. అమ్మాయిల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడులు బాధాక‌రం. అమ్మాయిల‌ని చెడు దృష్టితో చూసినా స‌రే క‌ఠిన‌మైన శిక్ష వుంటుంద‌న్న భ‌యం ఏర్ప‌డాలి. ఆ భ‌య‌మే ఈ వ్యాధిక స‌రైన మందు. అందు కోసం బ‌ల‌మైన చ‌ట్టాలు మారాలి` అని స్ప‌ష్టం చేసింది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయ‌ని, అవి ఎప్పుడు ప‌రిష్కారం అవుతాయ‌ని, అంత వ‌ర‌కు ఎద‌రుచూసే ఓపిక ఎవ‌రిలో లేద‌ని, చ‌ట్టం నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌నే భ‌రోసాను క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతో వుంద‌ని ఈ సంద‌ర్బంగా స‌మంత మండిప‌డ్డారు. స‌మంత చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.