మహేష్ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేస్తున్నారుగా


మహేష్ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేస్తున్నారుగా
మహేష్ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేస్తున్నారుగా

సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాను ఓకే చేయలేదు. వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ అది ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినట్లే. ఇక గత కొన్ని బలంగా వినిపిస్తున్న వార్త. మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో సూపర్ స్టార్ స్పెషల్ రోల్ గురించే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో 30 నిమిషాల నిడివి కల పాత్రకు మొదట చరణ్ ను అనుకున్నా ఆర్ ఆర్ ఆర్ షూట్ వల్ల కుదరకపోవడంతో ఇప్పుడు మహేష్ ను అప్రోచ్ అయ్యారు.

మహేష్ కూడా చిరు సినిమాలో నటించడానికి సూచనప్రాయంగా ఓకే చెప్పినట్లు సమాచారం. మహేష్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కొరటాల శివ, ఆ పాత్రను మహేష్ కు తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కు ఒక పాట, ఒక ఫైట్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే చిరంజీవితో 15 నిమిషాల పాటు కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయిట. అంతే కాకుండా మహేష్ కు ఈ సినిమాలో హీరోయిన్ ను సెట్ చేస్తున్నారు. దాదాపు ఒక కామియో లాంటి పాత్రకు స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హాట్ ఫామ్ లో ఉన్న పూజ హెగ్డేను మహేష్ పక్కన నటింపచేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతే అనుకున్నట్లు జరిగితే మహేష్ ఈ చిత్రానికి జూన్ నుండి కాల్ షీట్స్ కేటాయించే అవకాశముంది. రామ్ చరణ్, మాట్ని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఆగస్ట్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.