కరోనాను ఎదుర్కోవడానికి తారల విరాళాలు..


కరోనాను ఎదుర్కోవడానికి తారల విరాళాలు..
కరోనాను ఎదుర్కోవడానికి తారల విరాళాలు..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. ప్రపంచం మొత్తం ఈ వైరస్ కారణంగా వణికిపోతోంది. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో రోజుకు వందల్లో చనిపోతున్నారు. ఇండియాలో సైతం ఈ వైరస్ నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 700 దాటగా మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తెలంగాణలో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య 45కి వెళ్ళింది. రానున్న రోజులు చాలా జాగ్రత్తగా గడపాల్సినవి. రానున్న పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే ఇండియా ఈ కరోనా గండాన్ని గట్టెక్కగలదు. ఇదిలా ఉంటే ఇండియా మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా ముందుండే సినీ పరిశ్రమ ఈ కష్ట సమయంలో కూడా ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను మన హీరోలు, దర్శకులు తమకు తోచినంత విరాళాలు ఇస్తుండడం నిజంగా స్ఫూర్తిదాయకమైనది.

ఇప్పటివరకూ మన సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో ఇక్కడ చూద్దాం.

ప్రభాస్ – 4 కోట్లు (3 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ + చెరో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్)

పవన్ కళ్యాణ్ – 2 కోట్లు (1 కోటి పీఎం + 50 లక్షలు + 50 లక్షలు)

అల్లు అర్జున్ – 1కోటి 25 లక్షలు (ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ + కేరళ)

చిరంజీవి – 1 కోటి

మహేష్ బాబు – 1 కోటి

ఎన్టీఆర్ – 75 లక్షలు

రామ్ చరణ్ – 70 లక్షలు

నితిన్ – 20 లక్షలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ – 20 లక్షలు

దిల్ రాజు – 20 లక్షలు

కొరటాల శివ – 10 లక్షలు

సుకుమార్ – 10 లక్షలు

సాయి తేజ్ – 10 లక్షలు

అనిల్ రావిపూడి – 10 లక్షలు

వివి వినాయక్ – 5 లక్షలు

థమన్ – 5 లక్షలు (సంగీత కళాకారులకు)

అల్లరి నరేష్ – 50 మంది తన చిత్ర టీమ్ కు తలా 10,000 చొప్పున

మంచు మనోజ్, రాజశేఖర్ – డబ్బు రూపంలో కాకుండా అవసరమైన వారికి సరుకులు వంటివి ఇచ్చారు.