ఎట్టకేలకు మొదలవుతున్న ఇండియన్-2!!


indian-2 shooting started
indian-2 shooting started

ఎట్టకేలకు మొదలవుతున్న ఇండియన్-2!!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న :ఇండియన్-2” చిత్రం ఎట్టకేలకు ఈ నెలాఖరునుండి షూటింగ్ ప్రారంభవుతుందాని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. కొద్దీ రోజుల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందన్న వార్తలు కోకొల్లలుగా వస్తోన్న నేపథ్యంలో లైకా ప్రొడక్షన్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థలు మళ్లీ ఈ చిత్రాన్ని ప్రారంభిస్తోన్నట్లు తెలుస్తోంది. కాజల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా సిద్దార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అప్పట్లో భారతీయుడు ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అంతకు మించి భారతీయుడు-2 ఉండేలా దర్శకుడు శంకర్ అన్ని విధాలుగా కేర్ తీసుకొని చేస్తున్నారని ట్రేడ్ టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన కమల్ హాసన్ గెటప్స్, లుక్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతోందా అని ప్రేక్షకులు అభిమానూలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు!!