హండ్రెడ్ ప‌ర్సెంట్ లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గం:  వెంక‌టేష్‌

హండ్రెడ్ ప‌ర్సెంట్ లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గం:  వెంక‌టేష్‌
హండ్రెడ్ ప‌ర్సెంట్ లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గం:  వెంక‌టేష్‌

క‌రోనా వైరస్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్ లాంటి సంప‌న్న దేశాల‌ని వ‌ణికిస్తోంది. అక్క‌డ చాప‌కింద నీరులా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ వేల‌ల్లో ప్ర‌జ‌ల ప్రాణాల్ని హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇండియన్ గ‌వ‌ర్న‌మెంట్ ముంద‌స్తుగా మేల్కొని దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ని విధించింది. 21 డేస్ లాక్ డౌన్‌ని విధించి ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా వుండాల‌ని, ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని కోరింది. దీనికి అన్ని వార్గాలు హ‌ర్షాన్ని ప్ర‌క‌టించాయి.

తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ని ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించ‌క త‌ప్ప‌ద‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన నేప‌థ్యంలో హీరో విక్ట‌రీ వెంక‌టేష్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాలంటే హండ్రెడ్ ప‌ర్సెంట్ లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గం అని వెల్ల‌డిస్తూ తాజాగా ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు.

మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోవాలంటే, మీ కుటుంబాన్ని కూడా ర‌క్షించుకోవాలన్నా ఇంటికే ప‌రిమితం కావాలి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌న కోసం చెబుతున్న లాక్‌డౌన్ రూల్స్‌ని పాటించాల‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇంట్లోనే వుండండి, సుర‌క్షితంగా వుండండి. ఎందుకంటే క‌రోనా వైర‌స్ టూ డేంజ‌ర‌స్‌. దీన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవ‌ద్దు. కోరోనాతో యుద్దంలో గెలిచి తీరాలంటే ఇంటికే ప‌రిమితం కండి` అన్నారు.