హీరో ఇంటిపై రాళ్ల దాడి


Stones thrown at kannada hero darshan house

కన్నడ హీరో దర్శన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది . బెంగుళూర్ నగరంలోని రాజరాజేశ్వరీ నగర ఐడియల్ హోమ్ లో దర్శన్ నివాసం ఉంటున్నాడు అలాగే అందులోనే కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నాడు . ఆ కార్యాలయం పై అలాగే ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో పోలీసులు దర్శన్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసారు . దర్శన్ ఇంటికి మాత్రమే కాకుండా హీరో యష్ ఇంటికి కూడా భద్రత కల్పించారు .

 

ఇంతకీ దర్శన్ ఇంటిపై దాడి చేయడానికి కారణం ఏంటో తెలుసా ….. …… నటి సుమలత కు మద్దతుగా దర్శన్ ప్రచారం చేయడమే ! తెలుగునటి అయిన సుమలత కన్నడ నటుడు అంబరీష్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే అంబరీష్ ఇటీవల మరణించడంతో సుమలత కు టికెట్ నిరాకరించారు దాంతో సుమలత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తోంది . సుమలతకు మద్దతుగా దర్శన్ ప్రచారానికి సిద్ధం కావడంతో ఈ దాడి జరిగింది .

English Title: Stones thrown at kannada hero darshan house