బిగ్ బాస్ : హేమాహేమీలంతా నామినేషన్స్ లోకి


Bigg Boss 3 Telugu
బిగ్ బాస్ : హేమాహేమీలంతా నామినేషన్స్ లోకి

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఫేక్ ఎలిమినేషన్ అయిన రాహుల్ నిన్న హౌజ్ లో పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ ఎంట్రీతో పునర్నవి, వితిక, మహేష్, వరుణ్ ఫుల్ హ్యాపీ అయిపోగా.. శివ జ్యోతి, శ్రీముఖి, రవి, బాబా డల్ అయ్యారు. రాహుల్ ఎంట్రీ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ జరిగింది.

శ్రీముఖి, శివజ్యోతి.. వరుణ్, రాహుల్.. వితిక, రవి.. బాబా, పునర్నవిలు టీమ్స్ గా విడిపోయి ఒకరు సేఫ్ అవ్వాలి, ఒకరు నామినేట్ అవ్వాలి. ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారో, అందుకు గల కారణాలు ఇద్దరూ చెప్పాల్సి ఉంటుంది. కొన్ని వాదనలు, గొడవలు తర్వాత శ్రీముఖి, వరుణ్, రవి, బాబా భాస్కర్ నామినేషన్స్ లోకి వచ్చారు.

చూస్తుంటే ఈ నలుగురు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వీరిలోనుండి ఒకరు ఈ ఆదివారం ఎలిమినేట్ అవుతారు. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను నామినేషన్స్ లోకి తెచ్చి, కొంచెం వీక్ గా ఉన్న వితిక, పునర్నవి, శివజ్యోతి లాంటి వారిని కావాలని హౌజ్ లో ప్రొటెక్ట్ చేస్తున్నారని కొంతమంది ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. వీరు నామినేషన్స్ లోకి రాకుండా ఉండడానికే బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను ఇలా సెట్ చేసాడని ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో అన్న సంగతి పక్కనపెడితే శ్రీముఖి, వరుణ్, రవి, బాబా నలుగురూ స్ట్రాంగ్ కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.