ఫస్ట్ వీక్ లో 50 కోట్లకు పైగా వసూళ్లు


స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ మే 10 న విడుదలైన విషయం తెలిసిందే . టైగర్ ష్రాఫ్ ,అనన్య పాండే , తార నటించగా పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు . కాగా ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి భారతదేశ వ్యాప్తంగా 57కోట్ల 90 లక్షల వసూళ్ళని సాధించింది . దాంతో ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

టాక్ ఈ సినిమాకు అంతగా పాజిటివ్ గా లేదు కానీ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి దానికి వేసవి సెలవులు కూడా తోడయ్యాయి కాబట్టి వంద కోట్ల మైలురాయి ని దాటినా ఆశ్చర్యం లేదు . టైగర్ ష్రాఫ్ గత ఏడాది భాగీ 2 తో సంచలన విజయం సాధించాడు . భాగీ 2 ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్లకు వసూళ్ల ని సాధించి కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచింది . ఇక స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 కూడా వంద కోట్ల వసూళ్ల ని సాధించిన ఆశ్చర్యం లేదని అంటున్నారు .