బ‌న్నీ మార్నింగ్ వాక్ పిక్ వైర‌ల్‌!


బ‌న్నీ మార్నింగ్ వాక్ పిక్ వైర‌ల్‌!
బ‌న్నీ మార్నింగ్ వాక్ పిక్ వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న `పుష్ప‌` కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కేబీఆర్ పార్కులో జాగింగ్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేసిన బ‌న్నీ లాక్‌డౌన్ స‌డ‌లించిన త‌రువాత కూడా అదే పార్కులో నిత్యం సంద‌డి చేస్తున్నారు. అక్క‌డ మార్నింగ్ వాక్‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని గ్ర‌హించారో ఏమో గానీ ప్ర‌తీ రోజు ఉద‌యాన్నే హైద‌రాబాద్ శివార్ల‌కే వెళ్లి జాగింగ్ చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

బంజారా హిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వ‌ద్ద బ‌న్నీ జాగింగ్ చేస్తున్న ఫోటోలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. తాజాగా అలాంటి ఫొటోనే ఒక‌టి బ‌న్నీ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు. న‌గ‌ర శివార్ల‌లో బ‌న్నీ తెల్ల‌వారు జామున వాకింగ్ చేస్తున్న ఫొటో ఆక‌ట్టుకుంటోంది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌క్ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పు ఏర్ప‌డిన త‌రువాత ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు.