లాక్‌డౌన్ స‌డ‌లించినా బ‌న్నీ త‌గ్గ‌డం లేదు!


లాక్‌డౌన్ స‌డ‌లించినా బ‌న్నీ త‌గ్గ‌డం లేదు!
లాక్‌డౌన్ స‌డ‌లించినా బ‌న్నీ త‌గ్గ‌డం లేదు!

లాక్‌డౌన్ కార‌ణంగా జ‌న‌జీవితం స్థంభించి పోయింది. దీంతో ఆ స‌మ‌యంలో జ‌నం ఇంటి గ‌డ‌ప‌దాటి బ‌య‌టికి రావ‌డానికి సాహ‌సించ‌లేదు. జ‌నం వీధుల్లోకి రాక‌పోవ‌డంతో వీధుల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇదే స‌మ‌యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైద‌రాబాద్ బంజారా హిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో జాగింగ్ చేస్తూ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం, ఆయ‌న జాగింగ్ చేస్తున్న వీడియో బ‌య‌టికి రావ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తాజాగా క‌రోనా ఉదృతి నానాటీకీ హైద‌రాబాద్‌లో పెరుగుతున్నా అల్లు అర్జున్ మాత్రం కేబీఆర్ పార్కులో జాగింగ్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఫిజిక‌ల్‌గా ఫిట్గా వుంటే క‌రోనా ప్ర‌భావం చూపించ‌లేద‌ని చెబుతుండ‌టంతో ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టిన అల్లు అర్జున్ త‌న భార్య స్నేహారెడ్డితో క‌లిసి గురువారం కేబీఆర్ పార్క్‌లో జాగింగ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అక్క‌డ చాలా మంది జాగింగ్ చేస్తున్నా వ్య‌క్తిగత సిబ్బంది కార‌ణంగా అల్లు అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌డం లేద‌ట‌. దీంతో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌రువాత జ‌నం రోడ్ల మీదికి వ‌స్తున్నా అల్లు అర్జున్ మాత్రం కేబీఆర్ పార్కులో జాగింగ్ చేయ‌డానికే ప్రాధాన్య‌త నిస్తున్నాడ‌ట‌.

గురువారం అల్లు అర్జున్ త‌న భార్య స్నేహారెడ్డితో క‌లిసి జాగింగ్ చేస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా వుంటే బ‌న్నీ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. క‌రోనా ప్ర‌భావం ఎప్పుడు త‌గ్గితే అప్పుడు రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని చిత్ర బృందం ఎదురుచూస్తోంది.