శింబు కొత్త ల‌వ‌ర్ ఈమే అంటూ హ‌ల్‌చ‌ల్‌!


శింబు కొత్త ల‌వ‌ర్ ఈమే అంటూ హ‌ల్‌చ‌ల్‌!
శింబు కొత్త ల‌వ‌ర్ ఈమే అంటూ హ‌ల్‌చ‌ల్‌!

యంగ్ హీరో శింబు హీరోగా త‌మిళంలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుస సినిమాల‌ని రూపొందించి త‌మిళ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించిన శింబు వ‌రుస ప్రేమాయ‌ణాల‌తోనూ అంత‌కు మించిన వార్త‌ల్లో నిలిచారు. న‌య‌న‌తార‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి కెరీర్‌ని ప‌క్క‌దారి ప‌ట్టించుకున్నాడ‌ని అప్ప‌ట్లో త‌మిళ వ‌ర్గాలు శింబుపై విమర్శ‌లు చేశారు.

ఆ త‌రువాత హ‌న్సిక‌తోనూ ప్రేమాయ‌ణాన్ని సాగించి మ‌రోసారి త‌మిళ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు. ఇద్ద‌రు క‌లిసి త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు కూడా వినిపించాయి. అయితే శింబు అల్ల‌రి త‌ట్టుకోలేని హ‌న్సిక అత‌నికి బ్రేక‌ప్ చెప్పేసి విడిపోయింది. ఆ త‌రువాత నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. ఇదిలా వుంటే తాజాగా శింబు మ‌రో న‌టి సుభీక్ష‌తో క్లోజ్‌గా వుంటున్నాడ‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ వార్త‌ల‌పై శింబు ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. కానీ న‌టి సుభీక్ష మాత్రం మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చింది. త‌నకు శింబు మంచి మిత్రుడు మాత్ర‌మే న‌ని, అంత‌కు మించి ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని, ఇద్ద‌రం క‌లిసి త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌మ‌నే వార్త‌ల్లో అస‌లు నిజం లేద‌ని సుభీక్ష స్ప‌ష్టం చేసింది.