సుబ్రహ్మణ్యపురం రివ్యూ


Subrahmanyapuram review rating
సుబ్రహ్మణ్యపురం రివ్యూ

సుబ్రహ్మణ్యపురం రివ్యూ :
నటీనటులు : సుమంత్ , ఈషా రెబ్బా
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాత : సుధాకర్ రెడ్డి
దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018

అక్కినేని మనవడు సుమంత్ హీరోగా పరిచయమై రెండు దశాబ్దాలు అవుతోంది కానీ హీరోగా సక్సెస్ కొట్టింది అంతంత మాత్రమే ! అయితే ఇటీవలే మళ్ళీ రావా చిత్రంతో హిట్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు సుమంత్ . సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యపురం ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

సుబ్రమణ్యపురం అనే గ్రామంలో ఊహించని విధంగా మనుషులు చనిపోతూ ఉంటారు . వాళ్లు ఎందుకు చనిపోతున్నారు అనేది మిస్టరీ గా మారడంతో దేవుడ్ని అంతగా నమ్మని నాస్తికుడైన సుమంత్ సుబ్రమణ్యపురం లో మనుషుల చావుకు కారణం తెలుసుకోవడానికి వస్తాడు . సుబ్రమణ్యపురం లో మనుషులు ఎందుకు చస్తున్నారో తెలుసుకున్నాడా ? లేదా ? దేవుని పై పోరాటం చేసిన ఈ మానవుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సుమంత్ నటన
ఈషా రెబ్బా
నేపథ్య సంగీతం
ట్విస్ట్

డ్రా బ్యాక్స్ :

ఎడిటింగ్

నటీనటులు :

సుమంత్ కు మళ్ళీ నటుడిగా సత్తా చాటే గొప్ప అవకాశం లభించింది . తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు సుమంత్ . తన నటనతో ఆకట్టుకున్నాడు ,అంతేకాదు ఈ సినిమాని తన భుజస్కంధాలపై మోశాడు . ఇక ఈషా రెబ్బా గ్లామర్ గా కనిపించడమే కాదు అందంగా నటించింది కూడా . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు .

సాంకేతిక వర్గం :

శేఖర్ చంద్ర ఈ చిత్రానికి అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది . పాటలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రీ రికార్డింగ్ తో సినిమాకు ఆయువు పట్టులా నిలిచాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఎడిటింగ్ లో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . ఇక దర్శకుడు విషయానికి వస్తే …… మంచి కథ , కథనం ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది . ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు కార్తికేయ సినిమా గుర్తుకు వస్తూనే ఉంటుంది . చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ దర్శకుడు బాగానే హ్యాండిల్ చేసాడు .

ఓవరాల్ గా :

సుబ్రమణ్యపురం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమా

English Title: Subrahmanyapuram review rating

Click here for English Review