ప్లాప్ అయిన సినిమాకు సక్సెస్ మీట్


Success meet for flop movie

ఆగస్టు 24 న విడుదలైన ” నీవెవరో ” చిత్రానికి పెద్దగా థియేటర్ లు లభించలేదు ఇక ఉన్న ఆ థియేటర్ లలో కూడా ప్రేక్షకులు లేక థియేటర్ లన్ని వెలవెలబోతున్నాయి అయినప్పటికీ సక్సెస్ మీట్ అంటూ పెట్టారు ప్లాప్ సినిమాకు . ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో తాప్సి , రితికా సింగ్ నటించారు కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రచయిత కోన వెంకట్ రచన అందించగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందింది .

ఆగస్టు 24న నాలుగు సినిమాలు విడుదల కాగా అన్ని సినిమాలు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయాయి అందులో ఈ నీవెవరో చిత్రం కూడా ఉంది . సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ సక్సెస్ మీట్ అంటూ పెట్టేస్తున్నారు , నిన్నటికి నిన్న నీవెవరో చిత్ర సక్సెస్ మీట్ పెట్టారు . సినిమాని జనాలు ఆదరిస్తున్నారని , పెద్ద సక్సెస్ అవుతుందని పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు . అయితే వాస్తవానికి థియేటర్ ల వద్ద కనీసం కరెంట్ చార్జీల మందం వచ్చే పైసలు కూడా రావడం లేదట ! కానీ ఈ రకంగానైనా ప్రచారం చేస్తే మరికొన్ని టికెట్లు తెగకపోతాయా అని ఆశ అంతే !

English Title: success meet for flop movie