ఆర్ ఆర్ ఆర్ లో సుదీప్.. క్లారిటీ వచ్చేసిందిఆర్ ఆర్ ఆర్ లో సుదీప్.. క్లారిటీ వచ్చేసింది
ఆర్ ఆర్ ఆర్ లో సుదీప్.. క్లారిటీ వచ్చేసింది

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 75 శాతం పూర్తయినట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ 20 నుండి మొదలవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని, పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సుదీప్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఈగలో విలన్ గా నటించాడు. అలాగే బాహుబలిలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఈ వార్త ఎక్కడినుండి మొదలైందో కానీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ విషయం సుదీప్ దాకా వెళ్లడంతో క్లారిటీ ఇచ్చాడు.

తాను ఆర్ ఆర్ ఆర్ లో లేనని, ఇప్పటివరకూ ఎవరూ తనను ఈ చిత్రం కూడా సంప్రదించేలేదని క్లారిటీ ఇచ్చాడు. సుదీప్ ఎంత మంచి నటుడో అందరికీ తెలుసు. తన పాత్రతో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లడంలో సుదీప్ సిద్ధహస్తుడు. అయితే ఇప్పటివరకూ ఎవరూ సంప్రదించలేదు అన్నాడు అంటే ఇకపై సంప్రదించే అవకాశాలున్నాయా అనే మరో వాదన మొదలైంది. అయితే ఇప్పటికే షూటింగ్ మెజారిటీ భాగం పూర్తవ్వడంతో ఇక సుదీప్ పాత్ర ఉంటుందని అనుకోలేం.