సుద్దాల అశోక్‌తేజ‌పై అది రూమ‌రేనా?


సుద్దాల అశోక్‌తేజ‌పై అది రూమ‌రేనా?
సుద్దాల అశోక్‌తేజ‌పై అది రూమ‌రేనా?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఠాగూర్‌` చిత్రంలోని `నేను సైతం ..` అంటూ సాగే గీతానికి సుద్దాల అశోక్‌తేజ జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు ఎన్నో చిత్రాల‌కు భావోద్వేగ‌భ‌రిత గీతాల్ని అందించారు. క‌మ‌ర్శియ‌ల్ గీతాల‌ని కూడా అందించారు. `ఫిదా` చిత్రం కోసం `వ‌చ్చిండే..` అంటూ సాగే జ‌న‌రంజ‌క‌మైన గీతాన్ని అందించారు. అయితే గ‌త కొంత కాలంగా ఆయ‌న చాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు.

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని, కాలేయ సంబంధిత స‌మ‌స్య ఆయ‌న‌ను వేధిస్తోంద‌ని తాజాగా ఫేస్ బుక్ వేదిక ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట‌రాజీలో ఆయ‌న చికిత్స పొందుతున్నార‌ని, కాలేయ మార్పిడి చికిత్స జ‌ర‌గ‌నుంద‌ని, ఇందుకు బి నెగిటివ్ బ్ల‌డ్ అవ‌స‌రం వుంద‌ని ఆ బ్లేడ్ ని ఇవ్వాల‌నుకున్నదాత‌లు గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట‌రాజీలో సంప్ర‌దించాల‌ని 8985038016 నెంబ‌ర్‌కు కాల్ చేయాల‌ని సుద్దాల ఫ్రెండ్స్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు కోరుతున్న‌ట్టు ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

అయితే ఈ పోస్ట్‌లో నిజం లేద‌ని కొంత మంది, నిజ‌మేన‌ని మ‌రి కొంద‌రు వాదిస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యులు ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల్లో నిజ‌‌మెంతా..ఆయ‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ రూమ‌ర్లేనా అని కొంత మంది అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.