ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ – సుధీర్‌బాబు ఫిల్మ్ షురూ!

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ - సుధీర్‌బాబు ఫిల్మ్ షురూ!
ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ – సుధీర్‌బాబు ఫిల్మ్ షురూ!

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ – సుధీర్‌బాబుల తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `స‌మ్మోహ‌నం`. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ త‌రువాత నాని – సుధీర్‌బాబు హీరోలుగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి` ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. దీంతో సరికొత్త క‌థ‌తో సుధీర్‌బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఓ ల‌వ్‌స్టోరీని సోమ‌వారం ప్రారంభించారు.

బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై గాజుల‌ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ప‌ణలో బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్లేప‌ల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందున్న ఈ మూవీలో హీరోయిన్ గా `ఉప్పెన‌` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. విభిన్న‌మైన రొమాంటిక్ ఎంట‌క్‌టైన‌ర్‌గా ఈ మూవీని రూపొందించ‌బోతున్నారు.

పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ నివ్వ‌గా, మైత్రీ మూవీస్ ర‌విశంక‌ర్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ని అంద‌జేశారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగ‌ర్‌, ఛాయాగ్ర‌హ‌ణం పీజీ విందా, ఆర్ట్ ర‌వీంద‌ర్‌, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంక‌టేష్‌, సాహిత్యం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. మార్చి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.