ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటున్న సుధీర్‌బాబు

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటున్న సుధీర్‌బాబు
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటున్న సుధీర్‌బాబు

కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్‌. ప్ర‌స్తుతం అంద‌రి కళ్ళు కృతి మీదే వున్నాయి. ఆమె కొత్త‌గా ఎవ‌రి సినిమాలో న‌టిస్తోంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. నానితో రెండు చిత్రాల్లో న‌టిస్తున్న‌ కృతి ఇప్పటికే రామ్ చిత్రాన్ని అంగీక‌రించిందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.  నాని న‌టిస్తున్న‌`శ్యామ్ సింఘా రాయ్` ఇటీవ‌లే కోల్‌క‌తాలో మొద‌లైంది.

ఇదిలా వుంటే కృతి తదుపరి చిత్రాన్ని సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ ల‌తో చేయ‌బోతోంద‌ని, దానికి ఆసక్తికరమైన టైటిల్ ని ఖ‌రారు చేశార‌ని తెలిసింది. ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పలి’ అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అని చెబుతున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప‌క్కా తెలుగు టైటిల్స్‌తో సినిమాలు తీస్తున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల ఇంగ్లీష్ టైటిల్‌తో చేసిన `వి` దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో మ‌ళ్లీ త‌న స్కూల్లోనే తాజా చిత్రాన్ని చేస్తున్నారాయ‌న‌. ఇది ఇంద్రగంటి తో సుధీర్ బాబు చేస్తున్న‌ మూడవ సినిమా. స‌మ్మోహ‌నం, వి త‌రువాత వీరిద్ద‌రూ క‌లిసి ఈ మూవీ చేస్తున్నారు.