బ‌యోపిక్ కోసం సైలెంట్‌గా రెడీ అవుతున్నాడు!


Sudheer babu preparetions started for gopichand bio pi
Sudheer babu preparetions started for gopichand bio pi

తెలుగులో సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెర‌పైకొచ్చిన చిత్రం `మ‌హాన‌టి`. ఈ సినిమా స్థాయిలో మ‌రో బ‌యోపిక్ ఆక‌ట్టుకోలేదు. అయినా బ‌యోపిక్‌ల నిర్మాణం మాత్రం ఆగ‌డం లేదు. తెలుగులో మ‌రో బ‌యోపిక్ రాబోతోంది. సుధీర్ బాబు హీరోగా ఓ బ‌యోపిక్ రాబోతోందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బ్యాడ్మంట‌న్ స్టార్ పుల్లెల గోపీచంద్ జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమాని తెర‌పైకి తీసుకురావాల‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌కు చెందిన ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మించాల‌ని ప్లాన్ చేసింది. ఆ త‌రువాత గోపీచంద్‌కు ఆ సంస్థ‌కు మ‌ధ్య రైట్స్ విష‌యంలో అభిప్రాయ భేధాలు త‌లెత్తాయ‌ని ఆ కార‌ణంగానే ఈ సినిమా కార్య‌రూపం దాల్చ‌డం లేద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే అది ఉత్త ప్ర‌చార‌మేన‌ని, గోపీచంద్ బ‌యోపిక్ ఆగిపోలేద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హీరో సుధీర్‌బాబు ఇండైరెక్ట్‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం గోపీచంద్ బ‌యోపిక్ కోసం త‌ను బ్యాడ్మింట‌న్ ప్రాక్టీస్ చేస్తున్నాన‌ని, దానికి సంబంధించిన ఓ వీడియోని సోష‌ల్ మీడియా ట్విట్టర్ వేదిక‌గా సుధీర్‌బాబు షేర్ చేశారు. `బ్యాక్ టు మై ఫ‌స్ట్ గాళ్ ఫ్రెండ్ బ్యాడ్మింట‌న్‌. తొలి ప్రేమ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేమ‌ని అంతా అంటుంటారు. ప్రిప‌రేష‌న్ టైమ్ ఫ‌ర్ పుల్లెల గోపీచంద్‌` అని ట్వీట్ చేశాడు. దీంతో పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రాబోతోంద‌ని స్ప‌ష్ట‌మైంది.