మహేష్ బావ రిజెక్ట్ చేస్తే చిరు అల్లుడు ఓకే చెప్పాడుSudheer babu rejected kalyan dhev accepted

మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఆమధ్య ఓ సినిమా ప్రారంభిచాడు కట్ చేస్తే ఎక్కడో తేడా వచ్చింది అంతే దర్శక నిర్మాతలకు హీరో సుధీర్ బాబు కు తేడా లొచ్చాయి దాంతో ఆ సినిమాని రెజెక్ట్ చేసాడు కట్ చేస్తే అదే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ . చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు , ప్లాప్ అయ్యింది దాంతో కొంతకాలం సినిమాలను పక్కన పెట్టాడు చిరు సలహా మేరకు .

విజేత సినిమాలో కళ్యాణ్ దేవ్ నటన పట్ల విమర్శలు వచ్చాయి దాంతో మరింతగా రాటుదేలాలి కాబట్టి నటనపై దృష్టి పెట్టమని కోరారట . మామ చిరుతో పాటు చరణ్ కూడా సలహా ఇవ్వడంతో నటన , డ్యాన్స్ పట్ల అవగాహనా పెంచుకున్న కళ్యాణ్ తాజాగా సుధీర్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాని ఓకే చేసి షాక్ ఇచ్చాడు . మొదటి సినిమా ప్లాప్ కావడంతో రెండో సినిమా పై ఆశలు పెంచుకున్నాడు కళ్యాణ్ దేవ్ . పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి .

English Title: Sudheer babu rejected kalyan dhev accepted