సుధీర్ బాబు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదిలేసుకున్నాడా?


సుధీర్ బాబు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదిలేసుకున్నాడా?
సుధీర్ బాబు బ్రహ్మాండమైన అవకాశాన్ని వదిలేసుకున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా, కృష్ణ అల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. కెరీర్ మొదట్లో కొంత తడబడినా సుధీర్ ప్రస్తుతం నిలదొక్కుకున్నాడు. తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రేమకథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి మంచి చిత్రాలు చేసాడు. నాని హీరోగా వి సినిమా చేసాడు.  ఉగాదికి విడుదల కావాల్సిన కరోనా కారణంగా ఇప్పుడు వాయిదా పడింది. సాంగ్స్, టీజర్ వంటివి చూస్తుంటే సుధీర్ కు ఈ చిత్రంలో పెద్ద రోల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. సినిమా విడుదలయ్యాక మరింత క్లారిటీ ఈ విషయంలో వస్తుంది.

ఇక ఒక్కోసారి మనకు వచ్చిన అవకాశాలు ఎలాంటివో, దేన్ని ఎంచుకోవాలో, దేన్ని ఎంచుకోకూడదో ముందే తెలుసుకోవాలి. ఒక్కోసారి హిట్ సినిమాలను కూడా అనుకోకుండా చేజార్చుకోవాల్సి వస్తుంది. మంచి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని గ్రహించి ఎంపిక చేసుకోవడంలోనే ఒక నటుడి యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సుధీర్ బాబు కొంత వెనుకబడ్డాడనే చెప్పాలి. బాలీవుడ్ లో వచ్చిన ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు సుధీర్.

భాగీ సినిమాలో సుధీర్ విలన్ గా చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో తొలి సినిమాతోనే విశేషమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు సుధీర్. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చినా కానీ తెలుగులో బిజీగా ఉన్న కారణంగా అందుకోలేదు. ఇక రీసెంట్ గా మీడియాతో ముచ్చటిస్తూ బాలీవుడ్ లో ఒక భారీ అవకాశాన్ని వదులుకున్న విషయాన్ని తెలియజేసాడు. రన్బీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాలో సుధీర్ కు రోల్ ఆఫర్ చేశారట. అయితే గోపీచంద్ బయోపిక్ పనులు ఉండడంతో సుధీర్ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దాదాపు 90 రోజుల కాల్ షీట్స్ అడిగారని, అందుకే అడ్జస్ట్ చేయలేకపోయానని చెప్పాడు సుధీర్. 90 రోజులు అంటే ముఖ్యమైన పాత్రనే ఆఫర్ చేసి ఉంటారు. మూడేళ్ళుగా మొదలవ్వని గోపీచంద్ బయోపిక్ కోసం భారీ బాలీవుడ్ ఆఫర్ ను చేజార్చుకున్నాడు.